• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కనకదుర్గ తెప్పోత్సవంలో ప్రమాదం

By Staff
|
విజయవాడఃవిజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ వారికి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన తెప్పోత్సవంలోపెను ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని హంసవాహనంపై కృష్ణా నదిలో ఊరేగిస్తుండగా బాణాసంచా వుంచిన పడవలో ఒక్కసారిగాపేలుళ్ళు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు గల్లంతుకాగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

తెప్పోత్సవం సందర్భంగా బాణాసంచా కాల్చేందుకుపెద్ద మొత్తంలో బాణాసంచాను ఓ పడవలో వుంచారు. ఆ పడవలో నుంచే బాణాసంచా కాలుస్తుండగా ప్రమాద వశాత్తు నిప్పురవ్వలు పక్కన వున్న బాణాసంచాపై పడ్డాయి. దీనితో పడవలో అగ్నిగుండంగా మారిపోయింది. ఈ సందర్భంగా పడవలో వున్న ఐదుగురు నదిలో పడిపోయారు. వారి కోసంపెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. బాణాసంచాపేలుళ్ళ కారణంగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమ్మవారి తెప్పోత్సవంలో ఇలా అపశృతి దొర్లడంతో ఉత్సాహభరితంగా జరగాల్సిన ఈ తెప్పోత్సవంలోవిచారం చోటు చేసుకున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X