విద్యాసాగర్‌బంధువు విడుదలకు ప్రయత్నాలు

కరీంనగర్‌: నక్సల్స్‌ చెరనుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర్‌ రావు బావమరిది మార్తాండరావునువిడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.మార్తాండరావును విడిపించేందుకు గ్రామీణులు మధ్యవర్తత్వం నెరుపుతున్నారు.మార్తాండరావు కిడ్నాప్‌ జరిగి శనివారం సాయంత్రానికి 36 గంటలుగడిచాయి. ఇంత వరకు ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ విషయమై జిల్లా అధికారులు పెదవి విప్పడంలేదు.

పోలీసులమని చెప్పినక్సల్స్‌ తమ ఇంటికి వచ్చి తమ సోదరుడుమార్తాండరావును తీసికెళ్లారని, నక్సల్స్‌ తమ పట్లదురుసుగా గానీ, అసభ్యంగా గానీప్రవర్తించలేదని మార్తాండరావు సోదరుడుమదనమోహన్‌ రావు చెప్పారు. మార్తాండరావునుఇది వరకు నక్సల్స్‌ బెదిరించడం గానీ, హెచ్చరించడం గానీచేయలేదని ఆయన అన్నారు. తమ సోదరుడికి ఏవిధమైన హానీ తలపెట్టబోమని నక్సల్స్‌హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. నక్సల్స్‌ తమతోడబ్బుల విషయం మాట్లాడలేదని, కాంట్రాక్ట్‌ పనుల గురించి మాట్లాడడానికే తీసికెళ్లివుంటారని ఆయన అన్నారు. ఇది వరకు కూడా రోడ్డు కాంట్రాక్టు పనుల గురించినక్సల్స్‌ తమ సోదరుడితో మాట్లాడినట్లుఆయన తెలిపారు. మార్తాండరావును విడిపించడానికి రెండు గ్రామాల ప్రజలు మధ్యవర్తిత్వం చేస్తారనినక్సల్స్‌ చెప్పినట్లు సమాచారం. మార్తాండరావు కిడ్నాప్‌ జరిగినవెంటనే ఆయన తలిదండ్రులు హైదరాబాద్‌వెళ్లిపోయారు. ముగ్గురు సోదరులు మాత్రంగ్రామంలోనే వున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+