ఆచూకీ కోసం కృష్ణానదిలో గాలింపు
విజయవాడఃకనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం సందర్భంగాజరిగిన బాణాసంచా ప్రమాదంలో గల్లంతయినవారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. బాణాసంచాపడవలో పేలుడు జరిగిన సందర్భంగా ఆ పడవలోవున్న తమ సహచరులు నలుగురు కనిపించడంలేదని కొందరు చెప్పారు. అయితే గల్లంతయిందిఇద్దరే అని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు.కనిపించకుండా పోయిన వారిలో ఒకరు దుర్గగుడిఅటెండర్ కాగా మరొకరి రాజమండ్రికి చెందినబాణాసంచా ఉత్పత్తి దారుని కుమారుడు. వారి కోసంశనివారం ఉదయం కూడా కృష్ణా నదిలో గాలింపుచేపట్టారు.
ఈసంఘటన గురించి తెలుసుకున్న వ్యవసాయశాఖమంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు శనివారంసంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు.గల్లంతయిన వారికుటుంబాలకు నష్టపరిహారంచెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఆయనహామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న ఏడుగురిని కూడా మంత్రిపరామర్శించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితిఆందోళనకరంగా వుంది.












Click it and Unblock the Notifications