ఆర్టీసి సమ్మెలో కొనసాగుతున్న ప్రతిష్టంభన
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి)సమ్మెలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్టీసి సమ్మె శనివారం కూడాకొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలుజరిగాయి. తిరుపతిలో రాస్తారోకో, ధర్నా జరిగాయి. ఈ ఆందోళనాకార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాలుపాల్గొన్నాయి. కర్నూలులో మహిళా సంఘాలుప్రదర్శన నిర్వహించాయి. హైదరాబాద్‌లో కూడామహిళా సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. ముఖ్యమంత్రికి, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలుచేశారు. ఆర్టీసి ప్రయివేట్ పరం చేయడానికి ప్రభుత్వంప్రయత్నిస్తోందని వారు విమర్శించారు.
ఆర్టీసి సమ్మెకుమద్దతుగా పీపుల్స్‌వార్ శనివారం వరంగల్ జిల్లాబంద్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇదిలావుంటే, ఆర్టీసి సమ్మెకు మద్దతుగా సోమవారంనుంచి పికెటింగ్‌లు నిర్వహించాలని తొమ్మిదివామపక్షాలు నిర్ణయించాయి. ఆర్టీసి సమ్మెకు మద్దతుగాఆదివారం బస్ డిపోలను ముట్టడించాలని యువజనకాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రావు కార్యకర్తలకుపిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications