ఆఫ్ఘన్ పై చండప్రచండ దాడులు
కాబూల్‌ః ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ పై అమెరికా యుద్ధవిమానాలు వరుసగా 21వ రోజు కూడా భారీ ఎత్తున బాంబులు కురిపించాయి. ఈ మూడు వారాల్లో కనీవినీ ఎరుగని రీతిలో శుక్రవారం రాత్రిపెనుసమరం సాగింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 11 గంటల పాటు అమెరికా యుద్ధవిమానాలు కాబూల్ పై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడులను తిప్పి కొట్టేందుకు తాలిబాన్లు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌లతో విఫలయత్నం చేశారు.
కాబూల్‌పైనే 20కి పైగా బాంబులు పడ్డాయి. శనివారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో నాలుగు బాంబులు కాబూల్ ను చాలా వరకు ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ నుంచి వార్తలు వెలువడ్డాయి. యుద్ధ ప్రారంభించిన తరువాత అమెరికా ఇంత చండప్రచండంగావిరుచుకు పడడం ఇదే ప్రథమం.












Click it and Unblock the Notifications