స్థానికాంశాలవల్లనే కిడ్నాప్: విద్యాసాగర్
హైదరాబాద్: స్థానికవ్యవహారాల కారణంగానే నక్సల్స్ తన బావమరిది మార్తాండరావును నక్సలైట్లు కిడ్నాప్ చేసివుంటారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగరరావు అన్నారు. తన మంత్రి హోదా కారణంగామార్తాండరావును నక్సల్స్ కిడ్నాప్ చేయలేదనిఆయన శనివారం విలేకరులతో అన్నారు. కంట్రాక్టువ్యవహారాల విషయంలో నక్సల్స్ తన బావమరిదిని తీసికెళ్లి వుంటారని ఆయన అన్నారు.
మార్తాండరావునువిడిపించేందుకు నక్సల్స్‌కు పెద్ద మొత్తంలోడబ్బులు ముట్టజెప్పే ప్రయత్నాలుజరుగుతున్నాయని వస్తున్న వార్తలను ఆయనఖండించారు. మార్తాండరావుకు ఏ విధమైన అపకారంజరగబోదని తాను భావిస్తున్నానని, మాట్లాడిమార్తాండరావును నక్సల్స్ పంపించి వేస్తారనితాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మార్తాండరావుకురాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయకక్షలకు, కార్పణ్యాలకు ఆయన దూరంగా వున్నారని,అందువల్ల ఇది రాజకీయ పరమైన కిడ్నాప్‌కాదని విద్యాసాగర్ రావు అన్నారు. తన బంధువుకాబట్టో, పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్తారనోమార్తాండరావును కిడ్నాప్ చేయలేదని ఆయనఅన్నారు.












Click it and Unblock the Notifications