సోనియాపై మేనక ధ్వజం
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీత చరిత్రలో రచయిత్రి కాథరిన్ ఫ్రాంక్‌అసత్యాలు ప్రచురించి తనను కించపరిచారని ఆరోపిస్తూ కోర్టు కెక్కిన చిన్న కోడలు, కేంద్ర మంత్రి మేనకా గాంధీ లండన్ కోర్టులో జయం సాధించారు. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఇందిరా గాంధీపెద్ద కోడలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరా గాంధీ జీత చరిత్ర పుస్తక ప్రచురణ వెనుక తన తోటి కోడలు సోనియా గాంధీ హస్తం ఉన్నదని ఆమె ఆరోపించారు. తను తప్ప కుటుంబంలోని ుగతాఅందరూ దుర్మార్గులని ప్రచారం చేయడానికి సోనియా దేశీ రచయిత్రి ఫ్రాంక్‌తో పుస్తకం రాయించారని ఆమె అన్నారు.
ఈ పుస్తకం రాయడానికి, ప్రచురించడానికి సహాయపడిన సోనియా గాంధీకి ఫ్రాంక్ పుస్తకంలోని ముందు మాటలో కృతజ్ఞతలు తెలియజేశారని మేనక చెప్పారు. అయితే, దీనిపై సోనియా ఏ ధమైన వ్యాఖ్యలూ చేయలేదు.
కాథరిన్, ఆమె రాసిన పుస్తకాన్ని ప్రచురించిన హార్పర్ అనే సంస్థ లండన్ కోర్టులో క్షమాపణలు చెప్పుకోవాల్సి రావడమే కాకుండా నష్టపరిహారం చెల్లించేందుకు సైతంఅంగీకరించారు.












Click it and Unblock the Notifications
