న్యూయార్క్‌ఃక్రిస్‌మస్ సెలవులు, నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా మరోసారి టెర్రరిస్టులు చెలరేగే అవకాశం వున్నదన్న వార్తలతో అమెరికా భద్రతా ఏర్పాట్లను గణనీయంగా పెంచింది. సెలవుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా వుంటుందని అందువల్ల మానాశ్రయాలు, ధ ప్రయాణకేంద్రాల వద్ద నేషనల్ గార్డ్స్ సంఖ్యను పెంచుతున్నట్టుగా అధ్యక్షుడు జార్జ్‌బుష్ ప్రకటించారు.
సెలవుల్లో మరిన్ని దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశం వున్నదని బుష్ అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపుఅంత్రాక్స్ కేసుల వల్ల మరో ముఖ్యమైన పోస్టాఫీసు మూతపడటంతో ప్రభుత్వంఅంత్రాక్స్ దాడులను నిర్మూలించడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పోస్టాఫీసులకుఅంత్రాక్స్ కవర్లు చేరుతునే వున్నాయని అధికారులుఅంటున్నారు. మూలాన్ని కనుగొని దెబ్బతీస్తే తప్ప ఈ ముప్పు తొలగదని అమెరికా భాస్తున్నది.












Click it and Unblock the Notifications