దోహాః వర్ధమాన దేశాలను భజించి పాలించాలనే ధోరణి మానుకుంటేనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌పురోగుంచగలుగుతుందని భారత వాణిజ్యశాఖ మంత్రి మురసోలి మారన్ స్పష్టం చేశారు. సంపన్న దేశాలు వర్ధమాన దేశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన దోహాలో జరుగుతున్న డబ్ల్యు.టి.ఓ. సదస్సులోకోరారు. డబ్ల్యు.టి.ఓ. ప్రపంచ వాణిజ్యానికి మకుటం లేని మహారాజు ఏdు కాదని ఆయన కాస్త ఘాటుగానే మాట్లాడారు.
అమెరికా, డబ్ల్యు.టి.ఓ.లు కలిసి వర్ధమాన దేశాల మధ్య చిచ్చుపెట్టి వారి ప్రయోజనాలకు ఘాతం కలిగిస్తున్నాయని మారన్ వరించారు. ఇలా అయితే డబ్ల్యు.టి.ఓ. చీలిపోతుందే తప్ప మరో ప్రయోజనం వుండదని మారన్ చెప్పారు. వర్థమాన దేశాలపై కర్రపెత్తనం చేయాలనుకుంటే డబ్ల్యు.టి.ఓ. లక్ష్యాలు సాధించలేదని కూడా మారన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications