న్యూయార్క్‌ః కాశ్మీర్‌పై భారత్‌ కోరితే ఈ క్షణమే తాము చర్చలకు సిద్ధంగా వున్నామని పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌ ముషారఫ్‌ ప్రకటించారు. ఐక్యరాజ్యసుతి సర్యసభ్య సమావేశంలో రెండు గంటల తేడాతో వాజ్‌పేయి, ముషారఫ్‌ ప్రసంగించారు. వాజ్‌పేయి నేరుగా తమను పేరుపెట్టి తిట్టనప్పటికీ ముషారఫ్‌ మాత్రం తన సహజ ధోరణిలో భారత్‌పై రుచుకుపడ్డారు.

బోస్నియా, కాశ్మీర్‌, కొసావో సమస్యలు మూడింటినిఒకే గాటనకట్టి ఆయన మాట్లాడారు. అంతర్జాతీయంగా తీవ్రసంక్షోభంలో వున్న ఈ మూడు ప్రాంతాలు ముస్లీం ప్రాంతాలు కావడం దురదృష్ణకరమని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సుతి తీర్మానాల ప్రకారమే తమహక్కుల రక్షణ కోసం కాశ్మీరీలు పోరాడుతున్నారని ఆయన చెప్పారు.

హక్కుల కోసం పోరాడుతున్నవారిపై టెర్రరిస్టు ముద్రవేస్తున్నారని దుయ్యబట్టారు. 75 వేల మంది కాశ్మీరీలను భారతసైన్యం దారుణంగా హతమార్చిందని ఆయన ఆరోపించారు. కాశ్మీర్‌లోస్టేట్‌ టెర్రరిజాన్ని (ప్రభుత్వం దమనకాండ) నిలిపివేయాలని భారత్‌ను డిమాండ్‌ చేశారు. అణ్వాస్త్రాల తయారీకి కూడా పాక్‌ మొదటశ్రీకారం చుట్టలేదని ఆయన స్పష్టం చేశారు. ఉపఖండంలో సమతౌల్యం కోసం తాము అనివార్యంగా అణ్వస్త్ర పరిజ్ఞానం సమకూర్చుకోవల్సివచ్చిందని ఆయన చెప్పారు. భారత్‌ ముందుకువస్తే అణుపాటవ పరీక్షలపై నిషేధానికి తాము సిద్ధంగా వున్నామని ఆయన ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+