నార్తరన్‌ అలయన్స్‌స్వాధీనంలో కాబూల్‌

కాబూల్‌ః ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్లకుపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌ మంగళవారం ఉదయం నార్తరన్‌ అలయన్స్‌పరమైంది. 50 నుంచి 60 మంది నార్తరన్‌ అలయెన్స్‌సైనికులు, నాలుగైదు వాహనాల్లో దక్షిణం నుంచి కాబూల్‌ లో ప్రవేశించారని ఎ.ఎఫ్‌.పి. వార్తా సంస్థ వెల్లడించింది. రాకెట్‌ లాంచర్లు, అత్యంత అధునాతనరైఫిల్స్‌ ధరించి వారు కాబూల్‌ లో ప్రవేశించారని తెలుస్తున్నది. నార్తరన్‌ అలయెన్స్‌ చాలాకాలం తరువాత తిరిగి కాబూల్‌ కు రావడం పట్ల కొందరు ఆఫ్ఘనీయులు హర్షం ప్రకటిస్తూ dధుల్లోకి వచ్చినట్లు సమాచారంఅందింది. ప్రజలు అల్లా ఓ అక్బర్‌ (దేవుడు అందరికంటే గొప్పవాడు) అని నినాదాలు ఇవ్వగా నార్తరన్‌ అలయెన్స్‌ కమాండర్ల కూడా వారికి అభివాదం చేస్తూ కాబూల్‌ లోకి ప్రవేశించారు.

నార్తరన్‌ అలయెన్స్‌సేనలు మొత్తం కాబూల్‌ వస్తాయా లేక వేరు వేరు పట్టణాల నుంచి దాడులు సాగిస్తారా అనే షయం ఇంకా వెల్లడి కాలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌ లో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు అమెరికా సన్నాహాలు ప్రారంభించింది ఐక్యరాజ్య సుతి ప్రధాన్‌ కార్యదర్శి కోఫి అన్నన్‌ సారధ్యంలో ఆఫ్ఘన్‌ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది అమెరికా అభిమతంగా కనిపిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+