కేంద్ర కేబినెట్ లోకి డీఎంకే..? వీరికి ఉద్వాసన: ఏపీ..తెలంగాణ నుంచి ఇన్..ఔట్..!!
కేంద్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో సీజేపీ నిరసనల తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు ఆమోదం తో పాటుగా మోదీ 4.0 లక్ష్యంగా కొత్త నిర్ణయాలు జరుగుతున్నాయి. కొత్త మిత్రుల కోసం కీలక మంత్రాంగం సాగుతోంది. వారికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తూ భారీ స్థాయిలో ప్రక్షాళనకు తుది కసరత్తు జరుగుతోంది. ఏపీ- తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో మార్పులు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రధాని మోదీ టీం రాజకీయంగా కీలక నిర్ణయాలకు సమాయత్తం అవుతోంది. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తోంది. అదే సమయంలో మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ నెల మూడో వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు బిల్లుల ఆమోదం పైన మంత్రాంగం వేళ కొత్త పార్టీలు మిత్రులుగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 12-13వ తేదీల్లో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైన అధికారిక ప్రకటన చేయనున్నారు. మంత్రుల పని తీరును ప్రధాని సమీక్షిస్తున్నారు. సగానికి పైగా మంత్రులకు ఉద్వాసన చెప్పాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

కొత్త సమీకరణాలు
కాగా, మంత్రివర్గంలో పన్నెండు ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పలువురు కొత్త వారికి ప్రధాని మోదీ అవకాశం కల్పించనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో కీలకమైన ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఎన్డీఏలో కొత్తగా చేరిన పార్టీలు, ప్రస్తుతం పలు శాఖలు నిర్వహిస్తున్న మంత్రులపై ఉన్న పనిభారం తదితర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రధాని నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరోవైపు, 37 మంది ఎంపీలున్న డీఎంకే, ఆరుగురు ఎంపీలున్న ఎన్సీపీ(పవార్) కూడా ఎన్డీఏలో చేరి, కేంద్ర మంత్రివర్గంలో పదవులు తీసుకునే ఛాన్స్ ఉందని బీజేపీ నేతల సమాచారం. ఈ రెండు పార్టీలు మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంలో డీఎంకే నుంచి ఎలాంటి స్పష్టత రావటం లేదు.
ఎన్డీఏలోకి కొత్త పార్టీలు.. పదవుల్లో ప్రాధాన్యత
పంజాబ్‌లో రాఘవ్ చడ్డా నేతృత్వంలో ఎన్డీఏ గూటికి చేరిన ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీలలో కొందరికి, శిరోమణి అకాలీదళ్ క మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కనుంది. కాగా.. ఏపీ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఒకరు.. టీడీపీ నుంచి ఇద్దరు కొనసాగుతున్నారు. టీడీపీ- జనసేన నుంచి ఒకరికి కొత్తగా అవకాశం దక్కనుంది. టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రామ్మోహన్ తో పాటుగా పెమ్మసాని శాఖలు మారటం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ఉన్నారు. వీరిని శాఖలు మార్పు చేసి కొనసాగిస్తూనే... కొత్తగా డీకే అరుణ - అదిలాబాద్ ఎంపీ నగేష్ లో ఒకరికి ఛాన్స్ ఖాయం గా చెబుతున్నారు. దీంతో.. ఈ నెలాఖరు లోగా కేబినెట్ విస్తరణ ఖాయంగా చెబుతున్న వేళ.. ఎవరికి అవకాశం దక్కుతుందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications
