PM Kisan నిధులు రూ 10 వేలకు పెంపు..? కేంద్రం క్లారిటీ- జమ ముహూర్తం..!!
PM Kisan నిధులు అందుకుంటున్న రైతులకు బిగ్ అప్డేట్. పీఎం కిసాన్ నిధులు ప్రస్తుతం అందిస్తున్న రూ 6 వేల మొత్తాన్ని రూ 10 వేలకు పెంచుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ పెంపుదల పైన కేంద్రం స్పష్టత ఇచ్చింది. అదే విధంగా పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మలి విడత నిధుల పైనా రైతులకు కీలక సమాచారం అందిస్తున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. అయితే ఈ సారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చే వార్షిక సాయాన్ని రూ. 6,000 నుండి రూ. 10,000కు పెంచుతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తాజాగా ఈ ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. గతం లో మాదిరిగానే అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 మాత్రమే అందుతాయని క్లారిటీ ఇచ్చింది.

కేంద్రం స్పష్టత... రైతుల ఖాతాల్లోకి నిధులు
కాగా, ఈ పథకం కింద చివరి విడత అయిన 23వ విడత జూన్‌లో విడుదలైంది. దీంతో.. 24వ విడత నిధుల జమ పైన చర్చ సాగుతోంది. ఈ నెలలోనే తొలుత విడదల చేయాలని భావించారు. వినాయక చవితి వేళ ఈ నిధులు జమ చేయాలని ఆలోచన చేసారు. అయితే, కేంద్రంలో ఈ మేరకు తాజాగా జరిగిన చర్చల్లో అక్టోబర్ తొలి వారంలో ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పథకంలో నిధులు పొందే రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉందని చబుతున్నారు. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాలనుకుంటే రైతులుఆన్‌లైన్‌లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ తో పాటుగానే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది.













Click it and Unblock the Notifications
