గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో వారి పై వేటు- కేసుల నమోదు..!?
గ్రామ- వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన నిరసనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వారిలో కొందరి తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక చర్యలకు దిగింది. కొందరు ఉద్యోగులు సీఎం చంద్రబాబుతో పాటుగా ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. నిఘా నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం దాదాపు 45 మంది ఉద్యోగుల పైన సస్పెన్షన్ వేటుతో పాటుగా కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం పిలుపు నిచ్చెన "ఛలో విజయవాడ" నిరసన కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, అనుమతి లేకుండా ఆందోళనల్లో పాల్గొన్న నేతలు మరియు సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టింది. అనుమతులు లేకుండా విజయవాడలో ధర్నా చేయటంతో కొందరు ఉద్యోగులు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిఘా అధికారుల నుంచి ఈ నిరసనల పైన ప్రభుత్వానికి అందిన నివేదిక మేరకు చర్యలకు సిద్దమైంది. వారిలో 45 మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా చేసిన వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు పైన చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వారి పైన చర్యలకు సిద్దమైంది. వారి పైన సస్పెన్షన్ తో పాటుగా కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ రోజు అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కఠిన చర్యల దిశగా ప్రభుత్వం
ఉద్యోగుల్లోని కొందరు సీఎం చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. తమ వెంట 1.30 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 5 లక్షల ఓట్లు ఉన్నాయని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ చేసిన బెదిరింపు వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను అధికారులు సేకరించారు. హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లవద్దనే ఆదేశాలను ధిక్కరించటంతో పాటుగా అనుమతి లేకుండా విజయవాడలో ఆందోళన చేయటం.. రెచ్చగొట్టే ప్రసంగాలు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటం పైన ఉన్నత అధికారులు సీరియస్ అవుతున్నారు. ప్రభుత్వం వారి సమస్యల పైన సానుకూలంగా ఉన్నా.. ఆందోళనల్లో పాల్గొనటం పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. మితి మీరి ప్రవర్తించిన 45 మంది ఉద్యోగుల పై కేసుల తో పాటుగా వేటు వేయాలని ప్రభుత్వానికి నివేదిక అందింది. దీని పైన ప్రభుత్వం తీసుకునే తుది చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
