థియేటర్లను షేక్ చేయబోతున్న రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా

తెలుగు తెరపై ఎప్పుడూ వచ్చే రొటీన్ సినిమాలకు భిన్నంగా, పూర్తిగా నేటివిటీతో కూడిన రా అండ్ రస్టిక్ కథాంశంతో వస్తోన్న చిత్రం 'అనకాపల్లి'. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. త్రినాథరావు నక్కిన అందించిన బలమైన కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ
రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ

నిర్మాత లగడపాటి శ్రీధర్ , సినిమా ప్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంతో విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. 'అనకాపల్లి' సౌండ్ రెండు రాష్ట్రాల్లో గట్టిగా వినిపించాలి అని సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆకాంక్షించారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. అనకాపల్లితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అక్కడే తాను చదువుకున్నానని తెలిపారు. త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రంతో ఓ మంచి ప్రయోగం చేశారని, ఈ సినిమాతో ఆయన నటుడిగానూ మరింత బిజీ అవుతారని అభినందించారు. త్రినాథరావు నక్కిన కథా ఆలోచన విధానాన్ని దర్శకుడు సాయి రాజేష్, ఆర్పీ పట్నాయక్‌లు ప్రశంసించారు. విక్రమ్ చాలా కష్టపడి అద్భుతమైన పాత్ర చేశాడని, విలన్‌గా తారక్ పొన్నప్ప నటన ప్రేక్షకులను భయపెట్టేలా ఉందని కొనియాడారు. ఇంద్రజ, సంధ్యా వశిష్టల నటన సినిమాకు ప్రధాన బలమని పేర్కొన్నారు.

Anakapalle Movie Pre-Release Event and Release Date Update Starring Vikram Sahidev Details

పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మన గడ్డ మీద పుట్టిన రూటెడ్ కథలు ఎప్పుడూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ సినిమా పూర్తిగా అనకాపల్లి ప్రాంతంలోనే షూట్ చేయడం వల్ల అక్కడి సహజత్వం తెరపై అద్భుతంగా పండింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన విక్రమ్ సహిదేవ్ ఈ చిత్రంలో ఎంతో మెచ్యూర్డ్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే, భయపెట్టే ప్రతినాయకుడిగా తారక్ పొన్నప్ప నటన థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. ఇదొక కేవలం ప్రేమకథ మాత్రమే కాదు.. స్నేహం, కుటుంబ బంధాలు, వాటి మధ్య వచ్చే సంఘర్షణలతో కూడిన ఒక పూర్తి ప్యాకేజ్. పాటలు, మాటలు, ఫైట్స్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

రవితేజ 'ఇరుముడి' మరో సెన్సేషన్.. ఓటీటీలోనూ తగ్గేదేలే..!
రవితేజ 'ఇరుముడి' మరో సెన్సేషన్.. ఓటీటీలోనూ తగ్గేదేలే..!

ఒక్క సెకండ్ కూడా ఆసక్తి తగ్గకుండా, ఎక్కడా డీవియేట్ కాకుండా సాగే ఈ రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తుంది. అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదలవుతున్న 'అనకాపల్లి' సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+