భారత టెక్ దిగ్గజాలకు బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా: మొదటి దెబ్బ ఈ సంస్థ మీదే

అమెరికాలో ఉద్యోగం చేస్తూ గ్రీన్ కార్డ్ కోసం స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ టెక్కీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కు చెందిన పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) దరఖాస్తులన్నీ కూడా స్తంభించిపోయాయి. వాటి ప్రాసెస్ ను అమెరికా నిలిపివేసింది. వర్క్ వీసా కార్యక్రమాలలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.

విదేశీ నిపుణులకు అమెరికాలో శాశ్వత నివాసం కల్పించడంలో పీఈఆర్‌ఎమ్ అనేది అత్యంత కీలకం. దీని నిబంధనల ప్రకారం.. అమెరికాలో సంబంధిత నిర్దుష్ట ఉద్యోగానికి అర్హులైన స్థానిక ప్రొఫెషనర్లు ఎవరూ అందుబాటులో లేరని, అందుకే తాము విదేశాల నుంచి వారిని తెచ్చుకున్నట్లు ఆయా టెక్ దిగ్గజాలు నిరూపించాల్సి ఉంటుంది. విదేశీ ఉద్యోగుల నియామకం వల్ల స్థానిక అమెరికన్ల వేతనాలు గానీ, పని వేళలు గానీ దెబ్బతినకూడదనే నిబంధన కూడా ఇందులో ఉంటుంది.

US Suspends Cognizant PERM Filings After Visa Fraud Probe New Blow to Permanent Residency Sponsorship

హెచ్-1బీ (H-1B), పీఈఆర్‌ఎమ్ వీసా నిబంధనల ఉల్లంఘనలపై వైట్ హౌస్ ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జూలై నుండి పక్కా దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే కాగ్నిజెంట్‌తో పాటు క్లౌడెరా ఐటీ సంస్థలపై కూడా రాడార్ లోకి వెళ్లాయి. అమెరికన్ ప్రొఫెషనర్లు, వర్కర్ల ప్రయోజనాలకు హాని కలిగిస్తే సహించేది లేదని ఆ దేశ లేబర్ డిపార్టమెంట్ ఐజీ ఆంథోనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు చట్టపర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

హెచ్ 1బీ, ఇతర వీసాలపై బిగ్ షాకివ్వనున్న ట్రంప్: అన్ని దారులూ మూసుకుపోతాయ్
హెచ్ 1బీ, ఇతర వీసాలపై బిగ్ షాకివ్వనున్న ట్రంప్: అన్ని దారులూ మూసుకుపోతాయ్

కాగ్నిజెంట్.. యుఎస్ లో అత్యధికంగా హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసే కంపెనీలలో ఒకటి. ఇటీవలి కాలంలో ఈ కంపెనీ నమోదు చేసుకుంటోన్న వీసాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2020లో 9,413 హెచ్-1బీ వీసా అనుమతులను పొందిన ఈ ఐటీ దిగ్గజం.. గత ఏడాది 3,510 మాత్రమే దక్కించుకోగలిగింది. పెర్మ్ నిబంధనల తాజా ప్రభావం.. ఒక్క కాగ్నిజెంట్ కే పరిమితం కావట్లేదు. ఇతర ఐటీ దిగ్గజాలు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసే టెక్కీల గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ పైనా దెబ్బ పడొచ్చు.

మజ్జి శ్రీను టీడీపీలో చేరిన వేళ.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స
మజ్జి శ్రీను టీడీపీలో చేరిన వేళ.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స

ఆయా సంస్థల కార్యకలాపాలన్నీ తమ సిబ్బంది కోసం చాలావరకు ఇలాంటి వీసా ప్రోగ్రామ్‌లపైనే ఆధారపడి సాగుతుంటాయి. ఈ క్రమంలోనే కాగ్నిజెంట్ పై వచ్చిన నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో అమెరికా అధికారులు మిగిలిన భారతీయ కంపెనీలపై కూడా నిఘా పెంచే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తోన్నాయి. కాగ్నిజెంట్ ఎదుర్కొంటున్న ఈ తాత్కాలిక సస్పెన్షన్ విచారణ ముగిసేంత వరకు కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+