న్యూఢిల్లీః ప్రపంచవాణిజ్య సంస్థ దోహా సమావేశాల్లో భారత్ తొలిసారిగా తన ప్రయోజనాలను తనతోటి వర్ధమాన దేశాల ప్రయోజనాలను పరిరక్షించడంలో కీలకమైన పాత్ర నిర్వహించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి మురసోలి మారన్ చెప్పారు.
యూరోపియన్ దేశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాము తీసుకున్న వైఖరి దేశానికి లాభం చేకూరుస్తుందని ఆయన చెప్పారు. దోహా సదస్సునుంచి తిరిగివచ్చిన అనంతరం ఇక్కడ జరిగిన లేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంపన్న రాజ్యాలకు, వర్ధమాన రాజ్యాలకు మధ్య తీవ్రస్తాయిలోనే అభిప్రాయభేదాలు వున్నప్పటికీ డబ్లుటివో నుంచి వైదొలిగే ఆలోచన భారత్‌కు లేదని ఆయన చెప్పారు.
దోహా సదస్సులో భారత్ సాధించిన జయాలు తక్కువేdు కాదని ఆయన తెలిపారు. ప్రపంచవాణిజ్య ఒప్పందం కింద తక్షణమే అములచేయాల్సిన 50 నిబంధనల షయంలో రాయితీని సాధించగల్గినట్టు ఆయన చెప్పారు. సదస్సులో భారత్ ఏకాకిగా ుగులుతుందన్న భయాలుఅర్ధరహితమని తేలిందని అనేక వర్ధమాన రాజ్యాలు భారత్‌కు బాసటగా నిలిచాయని మారన్ చెప్పారు.
ట్రిప్స్ ప్రజారోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అవరోధం కారాదన్న డిమాండ్‌ను సాధించుకోగలిగినట్టుగా ఆయన చెప్పారు.పేటెంట్స్ కంటే ప్రజారోగ్యం ముఖ్యమనే షయంలో డబ్లుటివో దేశాలను తాముఒప్పించగలిగినట్టు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications