కాబూల్‌ః అఎ్ఘానిస్తాన్‌లోని 60 శాతం భూభాగం నార్తర్న్ అలయన్స్ స్వాధీనం అయింది. ఇంకా 40 శాతం భూభాగాన్ని పెద్ద శ్రమలేకుండానే తాము వశపర్చుకోగలమని అలయన్స్ దళాలు ధీమాగా వున్నాయి.
జలాలాబాద్‌నుకైవసం చేసుకున్న అలయన్స్ దళాలు తాజాగా ఆదే స్పూర్తితో కాందహార్‌ను చుట్టుముట్టాయి. రక్తపాతం లేకుండా కాందహార్‌నుఅప్పగించి లొంగిపోవల్సిందిగా తాలిబన్లకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అలయన్స్ కమాండర్లు చెప్పారు.
ఇదిలా వుండగా కాందహార్‌పై జరిగిన అమెరికా బాంబు దాడుల్లో అల్‌ఖైదా స్థావరాలు ధ్వంసమయ్యాయని పలువురు అల్‌ఖైదా నేతలు మరణించారని తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి. కొందరిని తాము బందీలుగా కూడా పట్టుకున్నట్టు వారు చెబుతున్నారు. అయితే ముఖ్యనేతలు ఒమర్, లాడెన్ జాడమాత్రం ఇంకా తెలియలేదు. పలు ప్రాంతాల్లో తాలిబన్లు కడదాకా పోరాడేందుకే సిద్ధంగా వున్నట్టుగా సమాచారంఅందుతున్నది. తాలిబన్ల పోరాట స్ఫూర్తి ఇంకా తగ్గలేదనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications