తిరుచానూరుః తుళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రాుకవేత్త రామ్‌కో గ్రూప్ అధినేత పిఆర్ రామసుబ్రహ్మణ్య రాజు దీపావళి పర్వదినం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి వజ్రాలు పొదిగిన కర్ణాభరణాలను సమర్పించారు.
టిటిడి తరఫున ఈ కర్ణాభరణాలను ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కృష్ణయ్య తిరుమలలోస్వీకరించారు. అనంతరం పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య dటిని డిప్యూటీ ఇవో కృష్ణారెడ్డి,పేష్కార్ ప్రభాకర్‌రెడ్డి తిరుచానూరుకు తీసుకునివచ్చారు.
రామ్‌కో చైర్మన్ తమ కుటుంబసభ్యులతో కలసి ఆభరణాలను పళ్లెంలో వుంచి అమ్మవారి సన్నిధికి వెళ్లి సమర్పించారు. అమ్మవారికి వజ్రకర్ణాభరణాలు లేని షయం చెబుతూ ఇవో కృష్ణయ్య కోరిన కోరిక మేరకు తాము ఈ చిరుకానుకను అమ్మవారికి సమర్పించినట్టుగా సుబ్రహ్మణ్యరాజు చెప్పారు.












Click it and Unblock the Notifications