న్యూఢిల్లీః ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోటో కు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతునివ్వాలని ప్రధాని వాజ్‌పేయి కోరారు. టాడా వంటి చట్టాలకు కాలం చెల్లిందని నేటి పరిస్థితుల్లో ఇలాంటి చట్టాలను పట్టుకు వేళ్లాడితే ఉగ్రవాదాన్ని అణిచివేయడం సాధ్యం కాదని ప్రధాని అన్నారు.

రెండు రోజుల పాటు జరుగనున్న అంతర్రాష్ట మండలి సమావేశాన్ని ఆయన శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని కోణాల్లోంచి ఆలోచించి ఉగ్రవాదాన్ని ఎదుర్కునే పదునైన ఆయుధంగా పోటోకు ప్రభుత్వం రూపకల్పన చేసిందని ప్రధాని వరించారు. ఈ సమావేశంలో ధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రులు పోటోపై తమ అభిప్రాయాలను, సూచనలు తెలియజేయాలని ప్రధానికోరారు.

దేశం ఈ రోజు ఎదుర్కుంటన్న ప్రధాన సమస్య ఉగ్రవాదమనే షయం స్మరించరాదని ఆయన చెప్పారు. మరోరెండు రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ పోటో బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం వున్నట్టు ప్రధాని సూచనప్రాయంగా చెప్పారు. ఆర్ధిక వ్యవహారాలు, జయలలిత కేసు నేపథ్యంలో గవర్నర్ల పాత్ర వంటిఅంశాలను కూడా ఈ సమావేశం చర్చించే అవకాశం వుంది. ఇదిలా వుండగా, ఆర్ధికభారాన్ని రాష్ట్రాలు ప్రతిసారి కేంద్రం నెత్తిన వేసే పద్దతులకుస్వస్తి చెప్పాలని ప్రధాని కోరారు.
ఆపత్కాలంలో ఆదుకోవడం కేంద్రం ధర్మమైనా నిధుల సdుకరణకు తమవంతు ప్రయత్నాలు చేయకుండా రాష్ట్రాలు కేంద్రంపై పడటం సమంజసం కాదని ఆయన చెప్పారు. అదనపు నిధులకోసం రాష్ట్రాలు తెస్తున్న వత్తిడి వల్ల కేంద్రంపై భారం పెరుగుతున్నదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+