హిజ్బుల్ ప్రతిపాదనపై పరిశీలన: అద్వానీ
న్యూఢిల్లీ: కాశ్మీర్‌అంశంపై చర్చలకు సిద్ధపడుతూ హిజ్బుల్ ముజాహిదీన్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని హోం మంత్రి ఎల్.కె. అద్వానీ బుధవారం రాజ్యసభలో చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చర్యలపై వచ్చిన అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ ప్రతిపాదనను తాను పరిశీలిస్తానని చెప్పారు.
ఆయుధాలు దించేసి చర్చలకు సిద్ధపడే ఏ సంస్థతోనైనా ప్రభుత్వం చర్చలు, సంప్రతింపులు జరపడానికి సిద్ధంగా వున్నదని ఆయన చెప్పారు. ఇది చర్చలకు అత్యంత అవసరమైనదని ఆయన అన్నారు. సంప్రతింపులకు సిద్ధపడే ఏ సంస్థతోనైనా గతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని అద్వానీ స్పష్టం చేశారు.
మన పొరుగు దేశంలో 1999లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వంఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కృషి చేసిందని పాకిస్థాన్ పేరెత్తకుండా అద్వానీ దుయ్యబట్టారు. భారత్‌లోని సీమాంతర ఉగ్రవాదంపై అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో మనం ఫలితం సాధించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications