హైదరాబాద్‌ః 12వ అంతర్జాతీయ బాలలచిత్రోత్సవంలో ఇరాన్ కు చెందిన చిల్డ్రన్ ఆఫ్‌పెట్రోలియం సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికై బంగారు ఏనుగును సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి లలిత కళాతోరణంలో జరిగిన బాలలచిత్రోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆ చిత్రదర్శకుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంగారు నందిని, లక్షరూపాయల నగదునుఅందజేశారు. ఈ చిత్రోత్సవంలో మెజారిటీ అవార్డులు ఇరాన్ చిత్రాలకే లభించాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి హైదరాబాద్ లో నిర్మిస్తున్నచిల్డ్రన్ ఫిల్మ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 13వ అంతర్జాతీయ బాలలచిత్రోత్సవాన్ని ఆ కాంప్లెక్స్ లోనే జరుపుతామని ఆయన హాdు ఇచ్చారు. తెలుగు నిర్మాతలు, దర్శకులు బాలల చిత్రాలపై దృష్టి సారించాలని ఆయనకోరారు. 12వ చిత్రోత్సవంలో ఒక్క తెలుగు బాలల చిత్రం కూడా ప్రదర్శనకు నోచుకోకపోవడం నిజంగా చారకరమని ఆయన అన్నారు.
భారత దేశానికి చెందిన సీమా చక్రవర్తి కిస్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. అవార్డుల ప్రదానాత్సవంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి శివప్రసాద్, సాయిపరాంజపే, రామానాయుడు, డిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications