బిఎస్‌ఎఫ్ కాల్పుల్లో 12 మంది హతం
జమ్మూ: జమ్మూ డిజన్‌లోని కతువా జిల్లాలో అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంబడి భారత సరిహద్దు భద్రతా దళాలు (బిఎస్‌ఎఫ్) బుధవారం 12 మంది పాకిస్థాన్ చొరబాటుదార్లను కాల్చి చంపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంబడి కొన్ని చోట్ల భారత, పాకిస్థాన్ దళాల మధ్య కాల్పులు జరిగినట్లు బిఎస్‌ఎఫ్ వర్గాలు చెప్పాయి.
కతువా జిల్లాలోని నంగా సరిహద్దు గుండా కొంత మంది గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట 15 నిుషాల ప్రాంతంలో భారత్‌లోకి ప్రవేశిస్తుండగా బిఎస్‌ఎఫ్ అధికారులు కనిపెట్టారు. లొంగిపోవాల్సిందిగా బిఎస్‌ఎఫ్ బలగాలు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా చొరబాటుదార్లు భారత్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో బిఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపినట్లు బిఎస్‌ఎఫ్ అధికార వర్గాలు చెప్పాయి.
ఇదే సమయంలో పాకిస్థాన్ రేంజర్లు భారత శిబిరాలపైపెద్ద యెత్తున కాల్పులు జరిపారు. దీంతో బిఎస్‌ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. బిఎస్‌ఎఫ్, పాకిస్థాన్ రేంజర్ల మధ్య అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంబడి సాంబా, ఆర్.ఎస్.పురా, అఖ్నూర్ సెక్టార్లలో కూడా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో మరణించిన చొరబాటుదార్ల నుంచి పాకిస్థాన్ కరెన్సీని, డాక్యుమెంట్లనుస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications