కాబూల్: అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ను పట్టిస్తే 50 ులియన్ డాలర్ల నగదు బహుమతి ఇస్తామని తాలిబాన్ ప్రకటించింది.
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై, వాషింగ్టన్‌లోని పెంటగాన్‌పై ఒసామాబిన్ లాడెన్ దాడి చేయలేడని తాలిబాన్ అభిప్రాయపడింది. ఇస్లామ్‌కు చెడ్డపేరు తేవడానికి ప్రయత్నిస్తున్న యూదులే ఆ దాడులకు పాల్పడ్డారని కాందహార్‌లోని స్పిన్ బోల్దాక్‌సెక్యూరిటీ ఛీఫ్ మహమ్మద్ సయీద్ హక్కానీ అన్నారు. దాడులు చేసేంత సత్తా లాడెన్‌కు లేదని, తమ అతిథిఅయిన లాడెన్‌ను రక్షించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు.
ఒసామా బిన్ లాడెన్‌ను పట్టిస్తే 25 ులియన్ డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించిందని, తమదిపేద దేశమైనప్పటికీ బుష్‌ను పట్టిస్తే తాము 50 ులియన్ డాలర్ల బహుమతి ఇస్తామని ఆయన dుడియా ప్రతినిధులతో అన్నారు. ఉత్తమ ముస్లిమ్‌లెవరు కూడా లాడెన్‌ను పట్టివ్వరని ఆయన అన్నారు.
యూదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేశారనడానికి రుజువులు చూపగలరా అని ప్రశ్నిస్తే ఆ రోజు నాలుగు వేల మంది యూదులు వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌లో పనులకు వెళ్లలేదని ఆయన జవాబిచ్చారు. రెండో మానం దేన్ని తాకబోతుందో టెలిజన్‌కెమెరాలకు ఎలా తెలిసింది? వారు అఎn్ఘానిస్థాన్‌ను అంతం చేయాలనుకుంటున్నారు. మాకు మచ్చ తేవాలనుకుంటున్నారు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications