న్యూయార్క్‌ః ఉగ్రవాదం పై ఎక్కుపెట్టిన యుద్ధం అఎn్గాన్‌తో ఆగిపోదని పదేపదే ప్రకటిస్తున్న అమెరికా తన మనసులో మాట బయటపెట్టింది. అఎn్గాన్ తర్వాత లక్ష్యం ఇరాక్ అని అమెరికా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నట్టుగా అమెరికా పేర్కొంది.
సూడాన్, సొమాలియా కూడా అమెరికా చెబుతున్న జాబితాలో వున్నాయి. పనిలో పనిగా ఈ ఇరాక్‌తో పాటు కంటిలో నలుసులా అప్పుడప్పుడూ బాధపెట్టే ఈ రెండు దేశాలపై కూడా బాంబులు వేసే ఆలోచనలో అమెరికా వుంది. ఇప్పటికే అమెరికా దాని ుత్రరాజ్యాలు పదేపదే చేస్తున్న దాడులతో పూర్తిగా నేలమట్టమైన ఇరాక్ ఈ సారి మళ్లీ దాడులు జరిగితే భయానకమైన సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications
