బాన్‌ః అఎn్గాన్‌ మాజీ రాజు జహీర్‌ షా మళ్లీ వెలుగులోకి వచ్చారు. అమెరికా అభిష్టం మేరకు యుద్ధానంతరం అఎn్గాన్‌లో ఏర్పాటుకానున్న తాత్కాలిక ప్రభుత్వంలో జహీర్‌షాకు కీలకపాత్ర అప్పగించేందుకు అఎn్గాన్‌కు చెందిన వివిధ వర్గాలు సుముఖత వ్యక్తం చేశాయి.

జర్మనీ నగరం బాన్‌లో ఐక్యరాజ్యసమితి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై జరుగుతున్న చర్చల్లో నార్తర్న్‌ అలయన్స్‌ ప్రతినిధులు, పుష్తూ తెగ నేతలు, జహీర్‌ షా ప్రతినిధులు పాల్గొంటున్నారు. మంగళవారం తొలిరోజు జరిగిన చర్చల్లో అధికశాతం జహీర్‌షాకు ప్రధాన పాత్ర అప్పగించడంపైనే సాగింది. తాలిబన్ల నుంచి అఎn్గాన్‌ను విముక్తి చేయడంలో తాము ప్రధాన పాత్ర వహించినప్పటికీ అధికారం తమ సొంతం కావాలని ఆశించడం లేదని అలయన్స్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఏళ్లుగా అశాంతి, హింసాకాండతో అలమటిస్తున్న అఎn్గాన్‌కు శాంతి, భద్రతలను సాధించిన యోధులుగా మిగిలిపోతే చాలన్నది తమ అభిమతమని వారు అంటున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడితే చాలని వారు చెప్పారు. చర్చల సరళి సాఫీగా వున్నదని సామరస్య వాతావరణంలో పట్టువిడుపుల మధ్య చర్చలు జరుగుతున్న నిర్ధిష్టవ్యవధిలోనే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు ఒక రూపు తీసుకునే అవకాశం వున్నదని సమితి వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+