SIIMA Awards 2026: ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. ఉత్తమ నటి ఎవరంటే..?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. తొలిరోజు ఈవెంట్ లో భాగంగా తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు.

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన 'మిరాయ్‌' లో నటనకు గాను తేజ సజ్జా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈ మూవీ విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా తేజ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం విశేషం. అలాగే తేజ సజ్జాకు ఇది వరుసగా రెండో అవార్డు కావడం విశేషం. గతంలో హనుమాన్ చిత్రానికి గానూ ఆయన సైమా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక 2025 లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో నటనకు గాను ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌) అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలోనే బుల్లిరాజు పాత్రలో అలరించిన అలియాస్‌ భీమల రేవంత్‌ ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు కైవసం చేసుకోవడం విశేషం. మొత్తానికి తారల తళుకుబెళుకులు, వినోదభరితమైన నృత్య ప్రదర్శనల మధ్య ఈ సైమా అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది.

అలాగే 'కాంతార: చాప్టర్‌ 1' చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ స్టార్ హీరో రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా​లో కీలక పాత్ర పోషించిన శ్రద్ధా శ్రీనాథ్‌ ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని దక్కించుకుంది. ఇక అవార్డులు అందుకున్న విజేతల వివరాలు చూస్తే మిరాయ్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా తేజ సజ్జా అవార్డు కైవసం చేసుకున్నారు.

TejaSajja SIIMA 2026 awards Teja Sajja named Best Actor Awarded for the second consecutive time

ఇక ఉత్తమ నటిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్య రాజేశ్‌ సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు సత్యదేవ్‌ (కింగ్​డమ్), ఉత్తమ సహాయనటి శ్రద్ధా శ్రీనాథ్‌ (డాకు మహారాజ్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌), ఉత్తమ నటుడు హర్ష్ రోషన్(కోర్ట్), ఉత్తమ నటి సాక్షి మడోల్కర్(మోగ్లి), ఉత్తమ నేపథ్య గాయకుడు- రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం) తదితరులు సైమా అవార్డులను అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+