మాజీమంత్రి కొండా సురేఖ సంచలనవ్యాఖ్యలు.. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వారికి హెచ్చరిక!
మంత్రి పదవి పోయిన తర్వాత దాదాపు ఇన్నిరోజుల సైలెన్స్ ను బ్రేక్ చేసి కొండా సురేఖ దంపతులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు పదవుల కోసం ఆరాటపడలేదని కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. పది రోజుల నుండి కార్యకర్తలు ఎంతో బాధపడుతున్నారన్నారు .సుమంత్ బెయిల్ కోసం కార్యకర్తలను కలవడం ఆలస్యం అయిందన్నారు.
ఇప్పుడున్న నాయకులు పొద్దున ఒక పార్టీలో, మధ్యాహ్నం ఒక పార్టీలో తిరుగుతున్నారన్నారు. వైయస్సార్ చనిపోయాక ఇక్కడున్న గుంట నక్కలు తమను మోసం చేశారన్నారు . కెసిఆర్ సూచనతో వరంగల్ తూర్పులో పోటీ చేసి అప్పటి మంత్రిని 55 వేల మెజారిటీతో ఓడించానని గుర్తు చేశారు. పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి అక్రమంగా సంపాదించాడని వ్యాఖ్యలు చేశారు.

చిన్న తప్పు కానీ, చిన్న మచ్చ లేకుండా మూడు శాఖలను సమర్ధవత్తంగా నిర్వహించానన్నారు.పదవి అనేది అలంకారం మాత్రమే పని చేయాలనుకుంటే పదవి అక్కర్లేదన్నారు. నన్ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసినందుకు నేను బాధపడటం లేదన్నారు. మేము ఏ పార్టీలోకి పోయే ఆలోచన లేదు... కాంగ్రెస్ పార్టీలో పుట్టాము కాంగ్రెస్ పార్టీలో పెరిగాము, కాంగ్రెస్ లోనే కొనసాగుతామన్నారు.
అనివార్య కారణాలవల్ల టిఆర్ఎస్ పార్టీలోకి పోయాము కానీ ఎవరు ఆ పార్టీ నుండి వెళ్లగొట్టలేదని వ్యాఖ్యలు చేశారు. స్థానిక డివిజన్లో కనీసం కార్పొరేటర్ గెలిపించుకునే స్థాయి కూడా సారయ్యకు లేదన్నారు.ఇకనుండి ఎవరైనా తమ మీద మాట్లాడాలనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నవీన్ రాజ్ భుజాలపై బాధ్యతలు పెడుతున్నాం అన్నారు. 24 మంది కార్పొరేటర్ లను గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.
తమకు పైనుండి ఫోన్లు వస్తున్నాయి తమను ఎటు వెళ్లొద్దు అని, తాము పార్టీ మారేది లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు.ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తూర్పులో కొండా సురేఖకు మళ్లీ కాంగ్రెస్ టికెట్ వస్తదని వ్యాఖ్యలు చేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళీ తాను మంత్రి అవుతానని కొండా సురేఖ అన్నారు.












Click it and Unblock the Notifications
