హైదరాబాద్: భూసేకరణకు బాండ్లు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో ఆయన గురువారం ఆ విషయం చెప్పారు.
బాండ్ల ద్వారా భూములనుసేకరించి పేదలకు, గిరిజనులకు, బలహీన వర్గాలవారికి పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ పథకం వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. వేలాది ఎకరాల భూములు నిరుపయోగంగా పడి వున్నాయని, కొన్ని డబ్బులు ఇచ్చి, నాలుగైదు ఏళ్లలో చెల్లించే విధంగా కొంత మేరకు బాండ్లు ఇచ్చి ఈ భూములుసేకరిస్తామని ఆయన వివరించారు.
గిరిజనేతరులకు గిరిజనుల భూములను బదలాయించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన వన్ ఆఫ్‌సెవంటీ చట్టంలో మార్పులు తేబోమని ఆయన స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను నెల లోగా భర్తీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి రెండవ తేదీన నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమం ప్రారంభమయ్యే లోగా పాత జన్మభూములు పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications
