ఖాట్మండూః నేపాల్ రాజధాని ఖాట్మండూ శివార్లలోని బలాజులో వున్న బహుళజాతి సంస్థ కోకకోలా ఫ్యాక్టరీపై మావోయిస్టు తీవ్రవాదులు బాంబులతో దాడులు జరిపారు. రెండు శక్తమంతమైన బాంబులను తీవ్రవాదులు పేల్చారని ఈ దాడిలో బాటిల్ వాషింగ్‌ప్లాంట్ పూర్తిగా ధ్వంసమయిందని అధికారులు చెప్పారు.
అయిదు నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పేలినట్టుగా వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అనుమానంపై ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ప్లాంట్‌పై కోకకోలా సంస్థ సుమారు మూడు కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేశాయి.












Click it and Unblock the Notifications
