న్యూఢిల్లీ: అమెరికా నావికా దళ హెలికాప్టర్ భారత గగనతలంలోవిహరించడంపై ప్రకటన ఇవ్వడానికి గురువారం లోక్‌సభలో ప్రయత్నించినప్పుడు రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ప్రతిపక్షాల నుంచి త్రీవ నిరసనను ఎదుర్కున్నారు. ఆయన ప్రకటన ఇవ్వడానికి లేవగానే ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. జార్జి ఫెర్నాండెజ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగానే గురువారం ఆయన ఇచ్చే సమాధానాన్ని వినడానికి ప్రతిపక్ష సభ్యులు నిరాకరించారు.
కాంగ్రెస్ సభ్యులు గురువారం కూడా జార్జి ఫెర్నాండెజ్‌ను ప్రశ్నలు వేయడానికి నిరాకరించారు. మంత్రి పదవిని జార్జి ఫెర్నాండెజ్ అనైతికంగా చేపట్టారనివిమర్శిస్తూ కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నలు వేసేందుకు నిరాకరించారు. ఫెర్నాండెజ్ తన జీవతకాలమంతా నైతికత గురించి మాట్లాడారని, కానీ ఇప్పుడు అనైతికంగా పదవి చేపట్టారని,అందువల్ల ఆయనకు తాను ప్రశ్న వేయబోనని శంషుభాయ్ మక్వానా అన్నారు.












Click it and Unblock the Notifications
