న్యూయార్క్‌ః తాలిబన్లు అధిక సంఖ్యలో మొహరించిన కుందజ్‌నుంచి పాకిస్తాన్‌కు చెందిన సైనికులు, ఇతరులను ఖాళీ చేయించడానికి పాక్ విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించి వుంటారని అమెరికా అనుమానిస్తున్నది.
కుందజ్‌లో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు, పాక్ నుంచి తాలిబన్లకు మద్దతు వచ్చిన జీహాదీలు వున్నట్టుగా తొలుత అమెరికాకు సమాచారం అందింది. అయితే కుందజ్‌ను నార్తర్న్ అలయన్స్ స్వాధీన చేసుకున్న తర్వాత ముందుగా అనుకున్న స్థాయిలో పాకిస్తాన్ సైనికులు అక్కడ కనిపించలేదు. ఎత్తైన అఎn్గాన్ కొండల మాటున తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ముందే పాకిస్తాన్ వారిని తరలించి వుంటుందని అమెరికా అనుమానిస్తున్నది. కొండల కారణంగా పాకిస్తాన్ విమానాలు ఆ ప్రాంతాల్లో తిరిగినా గుర్తుపట్టడం కష్టమేనని అమెరికన్ సైనికాధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications
