న్యూఢిల్లీ: అమెరికా భారత్‌తో చురుకైన, సంప్రదాయేతరసైనిక సంబంధాలను ఆశిస్తోందని అమెరికా నావికా దళ కమాండర్ అడ్మిరల్ డెన్నిస్ బ్లెయిర్ చెప్పారు. ఈ విధమైన సంబంధం ఉభయదేశాలకు ప్రయోజనకరంగా వుంటుందని ఆయన గురువారం అన్నారు.
భారత్ ఒక శక్తిగా ఎదుగుతున్న గొప్ప దేశమని, గతంలో కన్నా ఇప్పుడు భారత్ ఆసియాలో మరింత సంక్లిష్టమైన, వాంఛనీయమైన పాత్రను పోషించాల్సి వుందని ఆయన అన్నారు. తాము భారత్‌తో రక్షణ ఒప్పందాన్ని ఆశించడం లేదని, ఉభయ దేశాలకు శ్రేయోదాయకమైన భద్రతాంశాల్లో పరస్పర సహకారాన్ని ఆశిస్తున్నామని ఆయనవిలేకరులతో అన్నారు.
భారత్, అమెరికా సాయుధ బలగాల మధ్య దీర్ఘ కాలిక భద్రతా సహకారం గురించి చర్చించడమే తన పర్యటన ప్రధానోద్దేశ్యమని బ్లెయిర్ పారిశ్రామిక అధిపతుల సమావేశంలో అన్నారు. ఆసియాలో శాంతి, భద్రత,స్వేచ్చల కోసం అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు దోహదపడుతాయని ఆయన అన్నారు. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న ప్రస్తుత తరుణంలో తాము భారత్‌తో సంబంధాలను వాంఛిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బ్లెయిర్ బుధవారంనాడు రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌తో, హోంమంత్రి ఎల్.కె. అద్వానీతో, విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌తో చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications
