వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః బడికి రాని వాళ్ళందరిని బాలకార్మికులుగా పరిగణిస్తూ ఓ చట్టం తీసుకువారావని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంకల్పించింది. కలెక్టర్లతో జరుగుతున్న మూడురోజుల సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ పాఠశాలలకు రాని పిల్లలు ఎవరో తేలితే తప్ప బాలకార్మికులు ఎవరనేది తేలదని,అందుచేత బడికిరాని వారందరినీ బాలకార్మికులుగా పరిగణిస్తూ చట్టం తీసుకురానున్నట్లు ఆయనవివరించారు. బాలకార్మికులుగా ముద్రపడిన వారు పాఠశాలకు రాకపోతే తల్లిదండ్రుల్ని సైతం శిక్షించేందుకువీలుకల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తామని చంద్రబాబువివరించారు. ఇక మీదట ఐదో తరగతి నుంచే కామన్‌ పరీక్షల విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

దేశంలోనే బాలకార్మికులు అధికంగా వుండడం, అక్షరాస్యతలో వెనుకబడి వున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని, ఈ మచ్చను మాపుకోవడానికిఅంతా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చినవిషయం విదితమే. సంపూర్ణ అక్షరాస్యతా సాధనకు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని పాఠశాలలోకు సొంతభవనాలు నిర్మిస్తామని ఆయనవివరించారు. ప్రతిరోజూ పాఠశాలలో ఉదయం పూట ప్రార్థన ్‌యిన వెంటనే ఏదో ఒకవిజయగాధను పిల్లలకు వినిపించాలని, ఇందుకు అవసరమైతే స్థానికంగా వున్న ప్రముఖలసేవల్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X