పవన్ ఆలోచనకు పీవీ సింధు ప్రశంసలు-స్పందించిన జనసేనాని..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో చేపట్టిన ఓ కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది. అదే మ్యాజిక్ డ్రెయిన్స్. గ్రామాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ రూపురేఖల్ని మారుస్తుందని భావిస్తున్న ఈ కార్యక్రమంపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు (Pv Sindhu) కూడా స్పందించింది. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని పీవీ సింధు అభిప్రాయపడ్డారు.
పవన్ ఆలోచనల్లో పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు. పవన్ 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సింధు ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. పాలనా వ్యవహారాలు కొత్తే అయినా పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని ప్రశంసించారు. దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారని, కానీ గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుందన్నారు. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారన్నారు.

#PawanKalyanTransformsAP #Chapter3
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 3, 2026
అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థ, అడుగడుగునా అపరిశుభ్రంతో అల్లాడుతున్న గ్రామాల్లో ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సంకల్పం వెలుగులు నింపింది. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రెయిన్లు మురుగు రహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయి. సిమెంట్… pic.twitter.com/hGzmSyPqIZ
ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారని కితాబిచ్చారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయన్నారు. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేయబడిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయని తెలిపారు. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం అన్నారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుందన్నారు. దీనిపై పవన్ కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం చంద్రబాబు సహకారంతో నిర్మిస్తున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్ల మ్యాజిక్ పై తన విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన పీవీ సింధుకు ధన్యవాదాలు తెలిపింది.














Click it and Unblock the Notifications