Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో క్షణక్షణం భయంతో గడిపా- పీవీ సింధు

ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల దుబాయ్ కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్, పోర్ట్ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ధృవీకరించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో విమానయానానికి తాత్కాలిక అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇరాన్ సంధించిన మిస్సైళ్ల వల్ల ఎయిర్ పోర్ట్ దెబ్బతింది.

ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిస్సైళ్లు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లు దుబాయ్ మీడియా తెలిపింది. విమానాశ్రయ కన్‌కోర్స్‌కు స్వల్ప నష్టం సంభవించింది. ఎయిర్ పోర్ట్ అధికారులు దీన్ని వెంటనే అదుపులోకి తెచ్చారు. రాత్రిపూట దాడుల వల్ల ఓ టెర్మినల్ సైతం ప్రభావితమైందని రాయిటర్స్ వివరించింది గానీ.. ఫ్లైట్ ఆపరేషన్లకు పెద్దగా అంతరాయం కలగలేదు.

PV Sindhu Olympic Medallist Stranded in Dubai During Iran Attacks Calls It Tense and Frightening

నగరంలోకి ప్రవేశించిన ఓ డ్రోన్‌తో ఇంటర్ సెప్ట్ అయినట్లు దుబాయ్ మీడియా ధృవీకరించింది. దాని శిథిలాలు బుర్జ్ అల్ అరబ్ బయటి భాగంలో స్వల్ప అగ్నిప్రమాదానికి దారితీశాయి. 1999లో నిర్మించిన ఐకానిక్ హోటల్‌లో అగ్నిప్రమాదం త్వరగా అదుపులోకి వచ్చింది. దీనివల్ల హోటల్ బయటి భాగం పాక్షికంగా దెబ్బతింది. పామ్ జుమేరాలోని ఓ హోటల్ సమీపంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. జెబెల్ అలీ పోర్ట్‌లోని ఒక బెర్త్ మంటలబారిన పడింది.

ఈ పరిణామాల మధ్య భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించినప్పుడు తాను అక్కడే ఉన్నానని వెల్లడించారు. ఇరాన్ దాడుల కారణంగా ఏర్పడిన ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ క్షణాలు తనకు ఎంతో భయంకరంగా గడిచాయని చెప్పారు. ఎయిర్ పోర్ట్ కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగిందని వివరించారు. పేలుడు జరిగిన వెంటనే దట్టమైన పొగ ఆవరించిందని, వెంటనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ సంక్షోభ సమయంలో దుబాయ్ విమానాశ్రయం స్టాఫ్, దుబాయ్ అధికారులు, భారత హైకమిషన్ నుంచి తమకు తక్షణ సహాయం అందిందని పీవీ సింధు తెలిపారు. వారి కృషి వల్ల తమ టీమ్ సురక్షితమైన ప్రదేశానికి తరలి వెళ్లినట్లు తెలిపారు. తమకు నిరంతర సహాయం అందించి సురక్షితంగా ఉంచినందుకు దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, పరిస్థితులు త్వరగా చక్కబడాలని కోరుకుంటోన్నట్లు చెప్పారు.

నిజానికి- సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి బర్మింగ్‌హామ్‌కు వెళ్తాల్సి ఉంది. దుబాయ్ ఆమెకు ట్రాన్సిట్ స్టాప్. మంగళవారం ప్రారంభం కావాల్సిన టోర్నమెంట్ కోసం వెళ్తున్న ఆమె విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఈ సంఘటనలతో ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానయాన కేంద్రం పూర్తిగా స్తంభించిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+