హైదరాబాద్: తీవ్రవాద వ్యతిరేక ఆర్డినెన్స్ (పొటో) పరిధిలో పీపుల్స్‌వార్‌ను చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు చెప్పారు. రాష్ట్రంలో పీపుల్స్‌వార్ నక్సలైట్లు జరిపిన విధ్వంసకాండను ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఇక్కడ ఖండించారు.

రాష్ట్రంలోని తీవ్రవాద సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూడకూడదని, సామాజిక, ఆర్థిక సమస్యగా కూడా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఆర్థిక, సామాజిక న్యాయంకోసం, సమానత కోసం కృషి చేస్తే తీవ్రవాదం మటుమాయం అవుతుందని ఆయన అన్నారు.
గ్రామస్వరాజ్యం సాధించడం ద్వారా తీవ్రవాదాన్ని నిర్మూలించవచ్చునని ఆయన చెప్పారు. గ్రామాభివృద్ధికివిశేష కృషి చేయాలని, గ్రామాభివృద్ధి ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయాలని, గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు నాయకత్వం వహిస్తే తీవ్రవాదం సమసిపోతుందని ఆయనవివరించారు.

Click it and Unblock the Notifications