ఐదుగురు అమెరికన్‌సైనికులు హతం
ఇస్లామాబాద్‌ః తాలిబన్ ఆత్మాహుతి దళాల దాడిలో అయిదుగురు అమెరికన్ కమాండోలు మరణించారు. ఈ విషయం తాలిబన్ కమాండర్లను ఉటంకిస్తూ బలూచిస్తాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ సంఘటన కాందహార్‌కు సమీపంలో దోలంగి ఎయిర్‌పోర్టు
వద్ద జరిగినట్టగా పత్రిక వెల్లడించింది.
ఎనిమిది మంది తాలిబన్ యోధులు ఈవిమానాశ్రయంలో దిగిన అమెరికన్ మెరైనర్లపై జిరిపిన దాడిలో ప్రాణత్యాగం చేసినట్టుగా కూడా ఆ పత్రిక ప్రకటించింది. ఇదిలా వుండగా కాందహార్‌లో తాలిబన్లు అమెరికన్‌సేనలు ముందు లొంగిపోవడం కంటే ప్రాణత్యాగానికే సిద్ధపడతారని పాకిస్తాన్‌లో తాలిబన్ల రాయబారిగా వున్న జయీఫ్‌పేర్కొన్నారు.
కడ ఊపిరి వరకు కాందహార్‌ను కాపాడుకోవడానికే తమసైనికులు ప్రయత్నిస్తారని ఆయన ప్రకటించారు. ఇదిలా వుండగా అమెరికా యుద్ధవిమానాన్ని కూడా కూల్చివేసినట్టుగా తాలిబన్లు ప్రకటించినప్పటికీ వారి ప్రకటనను అమెరికా ఖండించింది.












Click it and Unblock the Notifications
