హైదరాబాద్‌ః ఒక విదేశీ పిస్టల్ కోసం పీపుల్స్‌వార్ నక్సలైట్లు మెదక్ జిల్లాలో నివసిస్తున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ లా పౌంటీన్ ఫార్మ్‌హౌస్‌పై దాడి చేసి విదేశీ పిస్టల్‌ను ఎత్తుకుపోయారు.
గతంలో కూడా లాఫౌంటీన్ ఇంటిపై నక్సల్స్ దాడి చేశారు. శుక్రవారం నాడు కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన నక్సల్స్ ఆతర్వాత బ్రహ్మణపల్లిలోని లాఫౌంటీన్ ఇంటికి వెళ్లి ఆయన్ను తుపాకులతో బెదిరించి విదేశీ పిస్టల్ ఎత్తుకుపోయినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
