కాబూల్‌ఃకాందహార్‌పై అమెరికా బలగాలు దాడులనుమరింత ముమ్మరం చేశాయి. కాందహార్ చుట్టుపక్కలలాడెన్, ముల్లా ఒమర్ దాక్కుని వుంటారనిభావిస్తున్న కొండలపై భీకరంగా బాంబుల వర్షంకురిపించారు. అమెరికా వైమానిక దళంసాగిస్తున్న దాడుల చాటున నార్తర్న్ అలయన్స్‌బలగాలు కాందహార్‌లోకి కొద్దిమేర చొచ్చుకుపోగలిగాయి.
అయితేతాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా వున్న కారణంగాకాందహార్ పై పట్టు సాధించడం కష్టంగా వున్నదనిఅమెరికన్ సైనిక కమాండర్లు చెబుతున్నారు.కాందహార్‌ను తాలిబన్ల నుంచి విముక్తంచేసేవరకు యుద్ధం నిలిపే ప్రశ్నే లేదనివారు చెప్పారు. తాలిబన్లు లొంగిపోవడానికిసిద్ధంగా వున్నారని ఈ విషయంలో మంతనాలుకూడా జరుపుతున్నారని సమాచారం అందుతున్నది.ముల్లా ఒమర్ స్వేచ్ఛగా పారిపోవడానికి అవకాశంకల్పించే సమస్యే లేదని అమెరికా స్పష్టంచేసింది. తాలిబన్, అల్‌ఖైదా సంస్థలకుచెందిన సీనియర్ నేతలందరినీ బందీలుగాపట్టుకోవడమే తమ ధ్యేయమని వీరిలోఏ ఒక్కరినీ తాము వదలిపెట్టే సమస్యే లేదనిఅమెరిక రక్షణ మంత్రి రమ్స్‌ఫీల్డ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
