హోమ్ పేజి
హైదరాబాద్‌ఃమూసీ నది జలాల శుద్దికి సంబంధించిరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీప్రాజెక్టుకు ప్రధాని వాజ్‌పేయి ఆదివారం నాడుశంకుస్థాపన చేయనున్నారు. 295 కోట్ల రూపాయలభారీ వ్యయంతో ఈ ప్రాజెక్టునుచేపడుతున్నట్టుగా హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల్లోని వందలాది గ్రామాలకు కాలుష్యంపీడ ఈ ప్రాజెక్టు వల్ల తొలుగుతుందని ఆయనఅన్నారు.
కొన్నిపరిశ్రమల కారణంగా నదిలోకి మురుగు నీటినివదలడం వల్ల జరుగుతున్న జలకాలుష్యం మూసీ వల్ల అనేక గ్రామాలకుచేరుతున్నదని ఆయన చెప్పారు. ఈప్రాజెక్టుకు కావల్సిన నిధులను హైదరాబాద్‌మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాల్టీలు,కాలుష్యకారక సంస్థలు సమకూర్చుతాయనిమంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు తొలిదశను105 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్టుగాఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications
