సారథ్యానికి రబ్బానీ సిద్ధం
కాబూల్‌ః మాజీ రాజు జహీర్ షాతో పాటు పాతిక మంది సభ్యులతో ఏర్పాటు చేసే ఆపద్ధర్మ ప్రభుత్వానికి సారథ్యం వహించడానికి అఎn్గాన్ మాజీ అధ్యక్షుడు రబ్బానీ సంసిద్ధత వ్యక్తం చేసారు. ఐక్యరాజ్య సమితి సారథ్యంలో అఎn్గాన్‌కు చెందిన వివిధ తెగలు, పార్టీల నేతలతో బాన్‌లో జరుగుతున్న సమావేశాల సందర్భంగా రబ్బానీ తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన తన ప్రతిపాదనలను రబ్బానీ సమితి పరిశీలనకుపంపారు. అయితే రబ్బానీ సారథ్యంపై నార్తర్న్ అలయన్స్ నేతల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపుబాన్ చర్చలు కొంతమేర పురోగతి సాధించినట్టుగా తెలిసింది. నార్తర్న్ అలయన్స్ ప్రతినిధులు కొత్త ప్రభుత్వంలో వుండే తమవారిపేర్ల జాబితాను సమితికి అందజేశారు












Click it and Unblock the Notifications
