రాజీవ్‌ హత్యలో సోనియా హస్తం

హైదరాబాద్‌ః ప్రముఖులపై ఆరోపణలతో సంచలనం సృష్టించే జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి తన గురిని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీపైకి ఎక్కుపెట్టారు. రాజీవ్‌ గాంధీ హత్యవెనక సోనియాగాంధీ కుటుంబం హస్తం వున్నదని ఆయన అసాధారణ ఆరోపణలు చేశారు.

రాజీవ్‌ హత్యకు కారణమైన ఎల్‌టిటఇతో సోనియాకు సన్నిహిత సంబంధాలు వున్నట్టుగా ఆయనపేర్కొన్నారు. తన ఆరోపణలకు కొన్ని ఆధారాలను సిబిఐకిఅందజేసినట్టుగా ఆయన చెప్పుకున్నారు. శనివారం నాడు హైదరాబాద్‌లోవిలేకరుల సమావేశంలో ఆయన ఈ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోనియా తల్లికి ఆయుధాల వ్యాపారి ఖత్రోచికి మధ్య లావాదేవీలు వున్నాయనివీరి వ్యవహారం రాజీవ్‌గాంధీకి అప్పట్లోనే నచ్చేది కాదని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

రాజీవ్‌ మరణం వల్ల లాభపడింది సోనియాగాంధీ అని ఆయన ఆస్తులు బ్యాంక్‌అకౌంట్లు ఆమె పరం అయ్యాయని ఆయన చెప్పారు. ఏ నేరంలోనైనా లాభపడిన వారిని ఆనుమానించి కేసును దర్యాప్తు చేయడం వల్ల దోషులు బయటపడతారని ఆయన చెప్పారు. ఎల్‌టిటిఇతో సంబంధాలు వున్న తమిళనాడు పార్టీ ద్రావిడ కజగంతో సోనియాకు సంబంధాలు వున్నాయని ఈ పార్టీ నేతకు ఢిల్లీ ప్రభుత్వం ఎకరం స్థలాన్ని కేటాయించిందని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+