న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ తో సహా భారతదేశంలో చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను ప్రజలు క్రమంగాఅర్థం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఫిక్కీ సారధ్యంలో మంగళవారం కొత్తఢిల్లీలో జరిగిన ఎకనామిక్ ఫోరంలో ఆయన ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ లోవిద్యుత్ తో పాటు వివిధ రంగాల్లో చేపట్టిన సంస్కరణలను ఆయన ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకువివరించారు. ఇన్ని రంగాల్లో సంస్కరణలు చేపడుతున్నారు.... రేపుమీరు ఎన్నికల్లో గెలుస్తారా అని తనను కొందరు ప్రశ్నించారని, గెలిచి చూపించామని చంద్రబాబు చెప్పారు.
సంస్కరణలు అనివార్యం అని ప్రజలు గ్రహించారని, సంస్కరణలనుఅర్థం చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలువురు పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధినివివరించారు. దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తల సమక్షంలో చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది












Click it and Unblock the Notifications
