Viral video:కెనడాలో చాయ్ కోసం క్యూ..ఇంత క్రేజ్ ఏంది మావా..?
చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. ఆ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్..ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్..ఏ ఛాయ్ గరీబుకీ విందురా భాయ్..ఈ ఛాయ్ నవాబుకి బంధువేనోయ్..ఈ ఛాయ్ మనస్సుకి మందురా భాయ్..ఈ ఛాయ్ గలాసుకే జేజే.. అంటూ టీ గొప్పతనాన్ని వివరించారు ఓ సినీ కవి. ఇందుకు తగ్గట్టుగా మెగాస్టార్ తనదైన స్టెప్పులతో మెప్పించారు. ఇంతకీ ఈ చాయ్ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందో ఈ కథ చదివితే తెలుస్తుంది.
సాధారణంగా భారతీయులు టీ తాగందే ఉండలేరు.తెల్లారి నిద్ర లేస్తే రాత్రి పడుకునేవరకు ఈ ఛాయ్ వారికిచ్చే రిలీఫ్ అంతా ఇంతా కాదు. అందుకే ఇండియన్స్‌కు టీ అంటే ఒక పానీయం కాదు..అదొక ఎమోషన్.చాయ్‌లో ఎన్నోరకాలున్నాయి. అల్లం చాయ్, లెమెన్ టీ, గ్రీన్ టీ ఇలా రకరకాలున్నాయి. కొందరు కేవలం టీకొట్టుతోనే నెలకు లక్షల సంపాదిస్తున్నారు.ఇప్పుడు ఈ టీ స్టాల్స్ పలు దేశాల్లో కూడా చాలా పాపులర్ అయ్యాయి.ముఖ్యంగా యూకే, కెనడా దేశాల్లో ఈ టీ స్టాల్స్‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అంటే అక్కడి ప్రజలు టీని చాలా ఆస్వాదిస్తున్నారు.

కెనడాలో ఇండియన్ చాయ్ షాప్
తాజాగా కెనడాలోని వాంకోవర్ సిటీలో ఓ భారతీయుడు చాయ్ వాగన్ పేరుతో నిర్వహిస్తోన్న టీస్టాల్ వార్తల్లో నిలిచింది. ఆ టీస్టాల్లో వారు సర్వ్ చేసే భారతీయ మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఆ టీస్టాల్కు వచ్చే కస్టమర్లలో ఇటు అక్కడ స్థిరపడ్డ భారతీయులతో పాటు కెనడా దేశీయులు కూడా ఉన్నారు. అక్కడ ఎక్కువగా అమ్ముడుపోతున్న ఐటెం చోలే సమోసా.ఆ తర్వాత చికెన్ బిర్యానీ, మ్యాంగో షేక్‌లు అధికంగా అమ్ముడుపోతున్నాయి. ఇక టీ విషయానికొస్తే కెనడా దేశీయులు అల్లం ఛాయ్, యాలకుల ఛాయ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. పావ్ బాజీ, భేల్ పూరీ కోసం అక్కడి ప్రజలు ఎగబడుతుంటారు. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం ఈ టీస్టాల్ దగ్గర దొరుకుతుండటంతో ఈ ప్రాంతం నిత్యం కస్టమర్లతో రద్దీగా కనిపిస్తుంది.
ఆ టీస్టాల్ మెనూ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఛాయ్.. సమోసాను పాశ్యాత్య దేశాల్లో కూడా పాపులర్ చేస్తుండటం అభినందనీయం అంటూ ఒక నెటిజెన్ రాసుకొచ్చాడు. మరొక నెటిజెన్ తండూరీ చాయ్ మసాలా కోసం ఎదురుచూస్తున్నట్లు సరదాగా కామెంట్ చేశాడు. మొత్తానికి కెనడాలో ఈ టీ స్టాల్ చాలా పాపులర్ అయ్యింది. ఇండియన్స్‌తో పాటు కెనడా దేశీయులు కూడా ఇండియన్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. దీంతో ఆ నిర్వాహకుడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.












Click it and Unblock the Notifications
