Work From Home: ఆఫీసులకు సగం మందే రావాలి.. సర్కార్ సంచలన ఆదేశాలు!

దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోవాయు కాలుష్యం మళ్లీ భయానక స్థాయికి చేరుకుంటోంది. ప్రతి ఏటా శీతాకాలం ఆరంభంలో ఢిల్లీని ముంచెత్తే విష పూరితమైన పొగమంచు ఈసారి కూడా పౌరుల ఆరోగ్యానికి తీవ్ర సవాలుగా మారింది. రోజురోజుకూ పడిపోతున్న ఎయిర్ క్వాలిటీని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ (CAQM) రంగంలోకి దిగింది. పరిస్థితి విషమించకుండా ముందస్తు చర్యగా నవంబర్ 5 నుంచి నవంబర్ 20 వరకు అత్యంత కఠినమైన నిబంధనలను విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఆఫీసుల్లో సగం మందే రావాలి.. 50 శాతం డబ్ల్యూఎఫ్‌హెచ్!

ఢిల్లీతో పాటు గుర్గావ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధన వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. ఆయా ఆఫీసులలో కేవలం 50 శాతం సిబ్బంది మాత్రమే ఆఫీస్ కు రావాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అయితే, అత్యవసర సేవలు, నిరంతరం నడిచే పరిశ్రమలకు మాత్రమే ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పించారు.

Delhi Air Pollution CAQM Orders 50 Percent Work From Home for Delhi-NCR Offices Until November 20

నిర్మాణ పనులపై ఉక్కుపాదం.. దుమ్ము రేపితే చర్యలు!

కాలుష్యానికి ప్రధాన కారణమైన దుమ్ము, ధూళి చెలరేగకుండా చూసేందుకు ఎన్‌సీఆర్ వ్యాప్తంగా అన్ని రకాల భవన కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ పనులపై నిషేధం విధించారు. హైవేలు, రహదారులు, ఫ్లైఓవర్లు, విద్యుత్ లైన్లు, పైప్‌లైన్ పనుల వంటి బహిరంగ నిర్మాణాలను కూడా నవంబర్ 20 వరకు నిలిపివేయాలని పేర్కొంది. దీనివల్ల వాతావరణంలో దుమ్ము కణాలు కలవకుండా తగ్గించవచ్చని ప్యానెల్ భావిస్తోంది.

వాహనదారులకు అలర్ట్: నవంబర్ 1 నుంచి ఆ వాహనాలకు నిషేధం!
వాహనదారులకు అలర్ట్: నవంబర్ 1 నుంచి ఆ వాహనాలకు నిషేధం!

అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపు!

అయితే, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. రైల్వే, మెట్రో సేవలు, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్, ఆసుపత్రులు, తాగునీరు-పారిశుధ్య పనులు, జాతీయ భద్రత , రక్షణ శాఖకు సంబంధించిన అత్యవసర నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతాయి. ఈ ప్రాజెక్టుల్లో కూడా కాలుష్యం వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచంలోనే నంబర్ వన్ పొల్యూషన్ సిటీ.. 22 మన దేశంలోనే
ప్రపంచంలోనే నంబర్ వన్ పొల్యూషన్ సిటీ.. 22 మన దేశంలోనే

నవంబర్ నెల అంటేనే కాలుష్య ముప్పు!

గత 2018 నుంచి 2025 వరకు సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే, ప్రతి ఏటా నవంబర్ ప్రారంభం నుంచి మధ్యకాలం వరకు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరినట్లు కమిషన్ గుర్తించింది. పొలాల్లో వ్యర్థాల కాల్చివేత , దీపావళి తదనంతర ఉద్గారాలు, వాహనాల పొగతో పాటు గాలి వేగం తగ్గడం, వాతావరణంలో తేమ పెరగడం వల్ల కాలుష్య కణాలు కదలకుండా గాల్లోనే నిలిచిపోతున్నాయి. గాలి నాణ్యత సివియర్ లెవల్ చేరకుండా కాపాడటానికే ఈ 15 రోజుల ముందస్తు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+