హైదరాబాద్‌ః జనవరి నుంచి పంచాయతీ రాజ్ వ్యవస్థలో సమూల మార్పులకుశ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న గ్రామపాలనాధికారి వ్యవస్థను రద్దు చేసి వారి స్థానంలో గ్రామ కార్యదర్శులను నియమిస్తారు. గ్రామ సర్పంచ్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు, బాధ్యతాయుతమైన అధికారిగా ఈ గ్రామ కార్యదర్శి వ్యవహరిస్తారని, ఈ పరిణామాల వల్ల గ్రామీణ పాలనా వ్యవస్థ ఎంతో పటిష్టం అవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు.
గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడంతో పాటు కీలకమైన ఈ గ్రామీణ వ్యవస్థ పటిష్టానికి గ్రామ కార్యదర్శి తోడ్పడతాడని రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ ఈ సందర్భంగా చెప్పారు. గ్రామాలకు అధికారాలు ఇవ్వకుండా అన్ని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తన గుప్పెట్లోపెట్టుకుంటున్నదనే విమర్శల నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నూతన విధానానికిశ్రీకారం చుట్టింది.












Click it and Unblock the Notifications