కర్నూలుః కర్నూలు జిల్లాలో ఆదివారం ఉదయంఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా గనగండ్ల మండలం వెలుగోడు సమీపంలో ఓ ఆర్టీసు బస్సు ఆటోను డీ కొనడంతో ఎనిమిదిమంది అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి కోడుమూరు ఆస్పత్రిలో మరణించారు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
మృతులంతా ఆటోలో ప్రయాణిస్తున్న వారే కావడంవిశేషం. ఆరేడుగురు ప్రయాణించాల్సిన ఆటోలో తొమ్మిది మంది ప్రయాణించడం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రయాణ సౌకర్యాలు లేని కారణంగా ఒకొక్క సారి పది నుంచి 20 మంది వరకు కూడా ఆటో పైభాగంలో ప్రయాణించడం కర్నూలు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ దృశ్యమే.












Click it and Unblock the Notifications