విజయనగరంఃవిజయనగరం జిల్లా కురుపాం సమీపం లోని అటవీ శాఖ అతిథి గృహాన్ని నక్సలైట్లు ధ్వంసం చేశారు. పోటో చట్టం కిందపీపుల్స్ వార్ పై నిషేధం విధించడానికి నిరసనగాపీపుల్స్ వార్ నక్సలైట్లు గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసకర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం వేకువ జామున కురుపాం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ను నక్సలైట్లు శక్తిమంతమైన బాంబులతోపేల్చి వేశారు.
శనివారం నాడు ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోని కిన్నెరసాని అద్దాల మేడను నక్సలైట్లుపేల్చి వేశారు. కొత్తగూడెం లోకల్ గెరిల్లా స్వ్కాడ్ కు చెందిన నక్సలైట్లు వార్ పై విధించిన నిషేధానికి నిరసనగా ఈ చర్యకు పాల్పడ్డారు. ముగ్గురు పురుషులు, ఒక మహిళా నక్సలైట్లు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ఈ అద్దాల మేడను శక్తివంతమైన బాంబులతోపేల్చి వేశారు. ఈ సంఘటనలో పదిలక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు అధికారులుఅంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications