వన్డే సిరీస్‌కు ద్రావిడ్‌ దూరం

ముంబాయి: మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ను జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఇంగ్లాండుతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి, జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు జరిగే ఛాలెంజర్‌ సిరీస్‌ నుంచి తప్పించారు.

ద్రావిడ్‌ కోరిక మేరకే ఆయనను వన్డే సిరీస్‌ల నుంచి తప్పించినట్లు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి శరద్‌ దివాద్కర్‌ విలేకరులకు చెప్పారు. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి దక్షిణాఫ్రికా వెళ్లాలనుకుంటున్నందున ఈ సిరీస్‌లో తాను ఆడలేనని ద్రావిడ్‌ తెలియజేసినట్లు ఆయన చెప్పారు. భారత క్రికెట్‌ జట్టు 2002 మార్చిలో చేసే జింబాబ్వే పర్యటనకు పూర్తి ఫిట్‌నెస్‌తో ద్రావిడ్‌ వుంటాడని ఆయన అన్నారు.

ఇంగ్లాండుతో జరిగే ఐదు మ్యాచ్‌లు కోల్‌కత్తా, చెన్నై, కాన్పూర్‌, ఢిల్లీ, ముంబాయిలలో వుంటాయి. ఛాలెంజర్‌ సిరీస్‌ (డే అండ్‌ నైట్‌) బెంగుళూర్‌లో జరుగుతుంది. ఇంగ్లాండుతో జరిగే వన్డేల జట్టును జనవరి 13వ తేదీన బెంగుళూర్‌లో ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+